సీఐ నాగరాజు రిమాండ్ పొడిగింపు
సాయికృష్ణ ((Saikrishna)) మృతి (Death) కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ( CI Nagaraju) రిమాండ్‌ను విజయవాడ కోర్టు (Vijayawada Court) పొడిగించింది. బుధవారంతో రిమాండ్ గడువు ముగియనుండటంతో రాజమహేంద్రవరం (Rajamahendravaram) కారాగారంలో ఉన్న నాగరాజును వర్చువల్‌గా రెండో ఏజేఎంఎఫ్‌సీ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరపర్చారు. వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.








