Kanna Lakshminarayana: అందుకే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు : కన్నా లక్ష్మీనారాయణ
మాజీ సీఎం వైఎస్ జగన్ (Y.S. Jagan) కు రాజకీయ పరిజ్ఞానం లేదని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని పార్టీల అనుమతితోనే రాజధాని అమరావతి (Amaravati)ని ప్రకటించారన్నారు. అప్పుడు జగన్ అమరావతికి అంగీకరించారని చెప్పారు. ఒక్క అవకాశం ఇస్తే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానంటూ ప్రజలను మోసం చేశారన్నారు. తరువాత మాట తప్పి మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలు బెంబేలెత్తిపోయారని అన్నారు. అరాచక పాలనకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతోనే 2024 ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసెంబ్లీ (Assembly)కి వచ్చి అమరావతి ప్రజలకు, రైతులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందన్నారు. కానీ అహంకారంతో మాట్లాడుతున్న ఆయన్ను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. అమరావతే రాజధాని అని ప్రజలు స్పష్టమైన వైఖరితో ఉన్నారని అన్నారు. చట్టబద్ధత బిల్లు ఆమోదం సమయంలో వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అమరావతికి చట్టబద్ధత కోసం విశేషకషి చేసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








