Home Minister Anita: కుట్రలు చేస్తే ఉపేక్షించేది లేదు : హోం మంత్రి అనిత హెచ్చరిక
రాజధాని అమరావతి (Amaravati)లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల (Fire accidents)పై విచారణకు ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత (Anita) తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ ఘనంగా జరిగిందని, దాన్ని ఓర్వేలేక రాజధానిలో పైపులకు నిపు పెట్టారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. గతంలో రాజధాని అమరావతి నిర్మాణం ఓర్వలేక అరటితోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. పోలీసుశాఖ (Police Department) అన్ని కోణాల్లో విచారణ చేస్తోందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలు పన్నినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








