Assembly: ఏపీలో విజయవంతమైతే.. దేశమంతా : అయ్యన్న పాత్రుడు
ప్రజా సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీ (Assembly)కి గైర్హాజరవడం సబబు కాదని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం, పాలకపక్షం ఉంటేనే బాగుంటుందన్నారు. వైసీపీ (YCP) సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే సమయం కావాలి. అనర్హత వేటు అంశం ఏపీలో విజయవంతమైతే దేశమంతా అలాగే జరుగుతుంది. గవర్నర్ ప్రసంగం రోజు వస్తే హాజరు పరిగణించాలనే నిబంధన ఎక్కడిది? ఆ రోజు వచ్చినా హాజరుగా పరిగణించరు. నిబంధనలను కాదని, అడ్డగోలుగా వాదించేవారిని ఏమనాలి? మాజీ సీఎంగా దక్కాల్సిన అన్ని మర్యాదలు జగన్కు లభిస్తున్నాయి. అప్పట్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు పోరాడిన బయట స్నేహంగా ఉండేవారు. ఇప్పుడు ఆ సంస్కతి పోయి విరోధుల్లా తయారవుతున్నారు. శాసనమండలి అంటే పెద్దల సభగా, పెద్ద ఆలోచనలు ఉన్న వారితో ఉండేది. పెద్ద ఆలోచనలు లేనివారి ఆ సభలో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం అని అన్నారు.
ఇవి కూడా చదవండి







