Iran – Israel: యుద్ధానికి బ్రేక్..? రంగంలోకి టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్..?
అమెరికా(America), ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణాన్ని చల్లబరిచేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు కొన్ని ముస్లిం దేశాలు ముందుకు రావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టిన అమెరికా-ఇరాన్(America – Iran) ఉద్రిక్తతలను తగ్గించేందుకు తెరవెనుక భారీ కసరత్తు జరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో, ముస్లిం ప్రపంచంలోని మూడు కీలక దేశాలు టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్(Pakistan) మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమయ్యాయి.
ముఖ్యంగా, ఈ చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కాబోతోందన్న వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలతో పాటు టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల భద్రత కూడా ప్రమాదంలో పడింది. అటు అమెరికాతోనూ, ఇటు ఇరాన్‌తోనూ సత్సంబంధాలు ఉన్న ఈ మూడు దేశాలు.. యుద్ధాన్ని ఆపకపోతే ఇస్లామిక్ ప్రపంచం మొత్తం అగ్నిగుండం అవుతుందని భావిస్తున్నాయి. అందుకే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అగ్రనేతలకు మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చేందుకు ఈ దేశాలు రాయబారం నడుపుతున్నాయి.
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరపాలని పాక్ ప్రతిపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా మద్దతుతో పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. అమెరికాకు సన్నిహితంగా ఉంటూనే, పొరుగు దేశమైన ఇరాన్‌ను శాంతింపజేయడం పాక్ లక్ష్యంగా కనపడుతోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఈజిప్ట్ ప్రభుత్వాలు ఇప్పటికే ట్రంప్ బృందంతో సంప్రదింపులు జరిపాయి. యుద్ధం కంటే దౌత్యపరమైన పరిష్కారమే మేలని చెప్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని అంతమొందించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్న తరుణంలో.. ఈ మధ్యవర్తిత్వ వార్తలు రావడం గమనార్హం. ట్రంప్ కూడా యుద్ధం వల్ల పెరుగుతున్న చమురు ధరలు, కూలుతున్న అమెజాన్ సర్వర్ల వంటి సమస్యల వల్ల కొంత ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, టర్కీ, పాకిస్తాన్ ప్రతిపాదనలను ట్రంప్ పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆంక్షలు మరియు సైనిక దాడులతో సతమతమవుతోంది. ఒకవేళ అమెరికా కొన్ని ఆంక్షలను ఎత్తివేసి, ఇరాన్ అణు కార్యక్రమంపై పటిష్టమైన హామీ ఇస్తే.. ఇరాన్ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టర్కీ, ఈజిప్ట్ దేశాలు ఈ విషయంలో హామీదారులుగా ఉండాలని భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








