యూఏఈ చేతికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్..!
అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూనే.. గల్ఫ్ దేశాలను వణికిస్తోంది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ దేశాల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. దీంతో ఆయా దేశాలు స్వీయరక్షణపైఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఫలితంగా అమెరికా మిత్రుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ చత్రంలోకి వెళ్లిపోయింది. ఇజ్రాయెల్ తన అధునాతన ఐరన్ డోమ్ వ్యవస్థను అందించడంతోపాటు, దాన్ని నడిపే సైనిక బృందాలను కూడా తరలించింది.
ఇరాన్ దాడుల పెరిగిన సమయంలో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు నేరుగా ఫోన్ చేశారు. ఈ సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్)కు తక్షణ ఆదేశాలు జారీ అయ్యాయి. అబుదాబి వంటి కేంద్రాలు ప్రధాన లక్ష్యాలుగా మారినప్పుడు, ఐరన్ డోమ్ డజన్ల క్షేపణులను, డ్రోన్లను సిద్ధం చేసింది. యూఏఈ రక్షణ శాఖ ప్రకారం, ఇరాన్ మొత్తం 550 బాలిస్టిక్ క్షేపణులు, 2,200 డ్రోన్లను ప్రయోగించింది. ఈ సహాయంతో యూఏఈ తన భద్రతను బలోపేతం చేసుకుంది.
ఈ సంఘటన ఇజ్రాయెల్–యూఏఈ సంబంధాలకు ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. మొదటిసారిగా ఇజ్రాయెల్ తన దేశ సరిహద్దు బయట ఐరన్ డోమ్ను మోహరించింది. అయితే, అమెరికా కూడా తన సొంత రక్షణ వ్యవస్థలను ఉపయోగించడంతోపాటు, ప్రాంతీయ స్థిరత్వానికి కృషి చేస్తోంది. ఇరాన్ దాడులు యూఏఈ ఆర్థిక కేంద్రాలను బెదిరించినా, ఈ మిత్రత్వం యుద్ధ భయాన్ని తగ్గించి, భవిష్యత్ సహకారాలకు మార్గం సుగమం చేసింది.
ఇవి కూడా చదవండి








