ఈ రోజు రాత్రి జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. గతంలో ఎప్పుడెప్పుడు ఇలా చేశారంటే…
ఈ రోజు రాత్రి (శనివారం) 8:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. లోకసభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఈ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే ఈ రోజు ఉదయం కేంద్ర కేబినెట్ కూడా సమావేశమైంది. అయితే.. జాతినుద్దేశించి ఏఏ అంశాలపై మాట్లాడతారన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు.
అయితే.. ఈ రోజు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా ప్రతిపక్షాలు ‘తప్పు చేశాయని’, మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరించాయని ప్రధాని మోదీ అన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల వైఖరిని ఒక తప్పిదంగా అభివర్ణిస్తూ, రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నట్లు కూడా సమాచారం.
అయితే. .ప్రధాని నరేంద్ర మోదీ గతంలో కూడా జాతినుద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించిన సందర్భాలు వున్నాయి. అందులో
2016 లో ₹500, ₹1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది ఆయన అత్యంత ప్రాముఖ్యమైన జాతి ప్రసంగాలలో ఒకటి.
2020లో ఆర్థిక పునరుద్ధరణ కోసం పలు ప్యాకేజీలను ప్రకటిస్తూ ప్రసంగించారు.
కోవిడ్ సమయంలో, లాక్ డౌన్ గురించి వివరించారు. లాక్ డౌన్ విధించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆత్మ నిర్భర భారత్ గురించి వివరిస్తూ ప్రసంగించారు. ఇందులో
19 మార్చి 2020 – Janata Curfew పిలుపు
24 మార్చి 2020 – దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటన
3 ఏప్రిల్ 2020 – ఐక్యత కోసం దీపాలు వెలిగించమని పిలుపు
12 మే 2020 – Atmanirbhar Bharat Abhiyan ప్రారంభం
జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో, జీఎస్టీ సంస్కరణల గురించి జాతినుద్దేశించి ప్రసంగించారు.
పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో దేశ భద్రతకు సంబంధించి, సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రసంగించారు.
నవరాత్రి – ఆత్మనిర్భర్ భారత్ (సెప్టెంబర్ 2025): నవరాత్రి వేడుకల సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధి భారత్) పిలుపునిస్తూ, శక్తి పూజ గురించి ప్రసంగించారు.








