ఇక.. దేశంలో ప్రైవేట్ క్షిపణులు.. కేంద్రం నిర్ణయం
భారత దేశ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో అడుగు పడింది. భారత్ క్షిపణుల తయారీలో ప్రైవేట్ రంగ ప్రవేశానికి కేంద్రం ప్రణాళిక చేసింది. ‘‘అస్త్ర మార్క్-2 క్షిపణి తయారీ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను డీఆర్డీఓ జారీ చేయనుంది. దీని ద్వారా ప్రైవేట్ సంస్థల టెక్నాలజీని క్షిపణి తయారీకి వినియోగించుకోనున్నారు.
అత్యాధునిక క్షిపణుల తయారీ, అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా డీఆర్డీవో అభివృద్ధి చేసిన గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర మార్క్ 2 మిస్సైల్ (180-200 కి.మీ. దూరం)ను తయారు చేయడానికి రక్షణ శాఖ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయనుంది. ఇందులో ఐకామ్, టాటా గ్రూప్, అదానీ, మహీంద్రా, భారత్ ఫోర్జ్ తదితర ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు దేశ సాయుధ దళాల అవసరాలు తీర్చడం, మిత్రదేశాల నుంచి పెరుగుతున్న ఎగుమతి డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు.








