లెనిన్ తో లక్ మారిందా? భాగ్యశ్రీకి మరో బిగ్ ఛాన్స్!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse), చాలా తక్కువ టైమ్‌లోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ గా నిలిచింది. రవితేజ(raviteja)తో చేసిన మిస్టర్ బచ్చన్(Mr bachan) ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కింగ్డమ్(Kingdom), రామ్ పోతినేని(ram pothineni) సరసన ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Thaluka)లో నటించింది. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోకపోయినా, భాగ్యశ్రీపై దర్శక నిర్మాతల నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, యాక్టింగ్‌లో కనిపించిన సహజత్వం కారణంగా వరుస అవకాశాలు దక్కాయి.
తాజాగా అఖిల్ అక్కినేని(Akhil Akkineni) సరసన హీరోయిన్ గా నటించిన లెనిన్(Lenin)తో భాగ్యశ్రీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు ఆమె పాత్రకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు డైలాగ్‌లను స్పష్టంగా పలికించిన తీరు, ఎమోషనల్ సీన్స్ లో చూపించిన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాటల్లో ఆమె ఎనర్జీ, తెరపై కనిపించిన ఆత్మవిశ్వాసం కూడా పాత్రకు అదనపు బలంగా నిలిచినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదే ప్రదర్శన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) దృష్టిని కూడా ఆకర్షించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సంస్థ నిర్మించనున్న ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సినిమాల రిజల్ట్స్ ఆమె అవకాశాలకు అడ్డంకి కాలేదని, ఇప్పుడు లెనిన్ సక్సెస్‌తో కెరీర్ మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే భాగ్యశ్రీ తదుపరి సినిమా గురించి, సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి పనిచేస్తుందా లేదా అన్న విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.








