చిరునవ్వు.. చరిష్మా.. కాన్ఫిడెన్స్.. అన్నీ ఒకే ఫ్రేమ్‌లో!
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఫాలోవర్లకు షేర్ చేస్తూ టచ్ లో ఉండే ఐశ్వర్య తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు ఆఫ్ షోల్డర్ లావెండర్ టాప్ కు బ్లూ డెనిమ్ జీన్స్ ను మ్యాచ్ చేయడం సింపుల్ అయినప్పటికీ స్టైలిష్ లుక్ ను తీసుకొచ్చింది. చేతికి క్లాసిక్ వాచ్, మినిమల్ మేకప్, వేవీ హెయిర్ ఆమె లుక్ ను మరింత అందంగా హైలైట్ చేస్తుండగా, ఈ లుక్ లో ఐశ్వర్య గ్లామర్, గ్రేస్, స్టైల్ కంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపించడంతో సింపుల్ అవుట్‌ఫిట్ తో కూడా అందరినీ ఎలా ఆకట్టుకోవాలో ఐశ్వర్యను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆమె ఫోటోలకు లైకులు కొడుతున్నారు.









