మోక్షజ్ఞ లాంచ్‌పై సైలెన్స్.. తేజస్విని ఎంట్రీపై మాత్రం జోరుగా చర్చ!
నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ(Mokshagna) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి వార్తలొచ్చినప్పటికీ ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు నిరాశ కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో బాలకృష్ణ(balakrishna) చిన్న కూతురు తేజస్విని నందమూరి(Tejaswini Nandamuri) పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో ఆమె ఓ జ్యువెలరీ యాడ్‌లో కనిపించగా, ఇటీవల వైరలైన డ్యాన్స్ వీడియోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్‌ను చూసిన ఫ్యాన్స్ సినీ రంగంలోకి వస్తే మంచి అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమా విషయంలో ఇంకా క్లారిటీ కనిపించడం లేదు. ఒక దశలో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో ఆయన ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కొత్త డైరెక్టర్ లేదా నిర్మాణ సంస్థపై కూడా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ఆయన లాంచ్ ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తేజస్విని మాత్రం ఇప్పటివరకు నటిగా కెరీర్ ప్రారంభించాలనే ఉద్దేశాన్ని ఎక్కడా వ్యక్తం చేయలేదు. ఎక్కువగా మీడియా హడావుడికి దూరంగానే ఉంటూ, బాలకృష్ణకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో తెరవెనుక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఆమెకు సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆదరణతో, ఫ్యూచర్ లో టాలీవుడ్లో అడుగుపెడతారా అనే డిస్కషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక సంకేతాలు లేకపోయినా, నందమూరి ఫ్యామిలీ నుంచి తదుపరి వెండితెర పరిచయం ఎవరిదన్న ఆసక్తి మాత్రం అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.








