స్టాలిన్ వారసుడికి షాక్.. కంచుకోటలోనూ ఉదయనిధి వెనుకంజ!
Udhayanidhi Stalin : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అధికార డీఎంకే (DMK) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది.
వెనుకంజలో ఉదయనిధి..
చెపాకం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్లతో పాటు మొదటి రెండు రౌండ్ల లెక్కింపు ముగిసే సరికి ఆయన వెనుకంజలో ఉన్నట్లు సమాచారం.
మూడో స్థానానికి డీఎంకే..
రాష్ట్రంలో టీవీకే, ఏఐడీఎంకే పార్టీలు మొదటి రెండు స్థానాల్లో పోటీ పడుతుండగా, అధికార డీఎంకే అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోయింది. అరంగేట్రంలోనే టీవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ తమిళ రాజకీయాన్ని మలుపు తిప్పింది.
ప్రస్తుతం లెక్కింపు శరవేగంగా జరుగుతుండటంతో, తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి








