Lockdown: లాక్డౌన్ వదంతులకు చెక్.. ఇంధన సంక్షోభం లేదన్న కేంద్రం!
పశ్చిమాసియాలో (Middle East) రగులుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందని, త్వరలోనే దేశవ్యాప్తంగా మళ్లీ ‘లాక్డౌన్’ (Lockdown) విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ కేవలం నిరాధారమైన వదంతులు మాత్రమేనని, దేశంలో లాక్డౌన్ విధించే ఆలోచన, ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో లేనే లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) స్పష్టం చేశారు.
వదంతులు నమ్మొద్దు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఇంధనం, విద్యుత్ (Power), ఇతర నిత్యావసర సరుకుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు. “దేశీయ అవసరాలకు సరిపడా చమురు, గ్యాస్ నిల్వలు మన వద్ద పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల కోసం ముందుస్తుగానే మేం సన్నద్ధమై ఉన్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. అనవసర భయాందోళనలు సృష్టించే ఫేక్ వార్తలను (Lockdown) వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని ఆయన తేల్చి చెప్పారు.
పరిస్థితిపై ఇంటర్-మినిస్టీరియల్ ప్యానెల్
పశ్చిమాసియాలో రోజురోజుకూ మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా గొలుసుపై పడుతున్న ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి ‘ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్’ను (Inter-Ministerial Panel) ఏర్పాటు చేసింది. భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ప్యానెల్ (Lockdown) కూర్పే నిదర్శనం. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) నేతృత్వంలో ఈ ఉన్నతస్థాయి బృందం పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, ద్రవ్యోల్బణం పెరగకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, దేశీయ ఇంధన సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఈ బృందం (Lockdown) ప్రధాన లక్ష్యం.
తీరానికి చేరిన ‘జగ్ వసంత్’..
ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) యుద్ధ భయాలతో గత 23 రోజులుగా చిక్కుకుపోయిన భారీ ఎల్పీజీ (LPG) ట్యాంకర్ ‘జగ్ వసంత్’ ఎట్టకేలకు సురక్షితంగా భారత తీరానికి చేరుకుంది. గుజరాత్‌లోని కాండ్లా పోర్టులో (Kandla Port) లంగరు వేసిన ఈ వాణిజ్య నౌక ద్వారా సుమారు 42,000 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్ దేశంలోకి అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ నౌక రాక దేశీయ ఎల్పీజీ అవసరాలను తీర్చడంలో, మార్కెట్లో గ్యాస్ కొరత రాకుండా చూడటంలో ఎంతో కీలకం కానుంది. దీనికి తోడు, మరో 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సామర్థ్యమున్న ‘పైన్ గ్యాస్’ (Pine Gas) అనే మరో భారీ ట్యాంకర్ కూడా అతి త్వరలో కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు (Lockdown) చేరుకోనుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో ఇంధన కొరతపై వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పడినట్లయింది.
ఇవి కూడా చదవండి








