కేరళలో కమ్యూనిస్టులు అవుట్.. కాంగ్రెస్ దే విజయం
కేరళలో కమ్యూనిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. పినరయ్ విజయన్ నేతృత్వంలో సీపీఎం రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. మూడోసారి మాత్రం కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈసారి మాత్రం కమ్యూనిస్టులకు ఎదురు గాలే అని చెబుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కి ఈ సారి ఓటర్లు పట్టం కడతారని అభిప్రాయపడ్డాయి. ఇక.. బీజేపీ ఖాతా తెరిచే అవకాశాలున్నాయని కూడా పేర్కొన్నాయి.
లెఫ్ట్ ఫ్రంట్ – యాక్సెస్ మై ఇండియా 49-62
మాట్రిజ్ – 60-65
పీపుల్స్ పల్స్ – 55-65
పీపుల్స్ ఇన్ సైట్ – 58-68
యూడీఎఫ్
యాక్సెస్ మై ఇండియా – 78-90
పీపుల్స్ పల్స్ – 75-85
ఓట్ వైబ్ – 70-80
మాట్రిజ్ – 70-75
బీజేపీ
యాక్సెస్ మై ఇండియా – 0-3
మాట్రిజ్ – 3-5
పీపుల్స్ పల్స్ – 0-3
కేరళలో 140 స్థానాలకు గానూ ఈ నెల 9 న పోలింగ్ జరిగింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్యే ప్రధాన పోరు. అయితే.. ఐదేళ్లకోసారి అధికార మార్పిడి అనేది కేరళలో సహజం. కానీ 2021 ఎన్నికల్లో కమ్యూనిస్టులు వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చారు. అయితే మే 4 న తుది ఫలితాలు వస్తాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







