Iran War: ఇరాన్లో భారీ గ్రౌండ్ ఆపరేషన్? ‘పెంటగాన్ పిజ్జా మీటర్’ సంకేతాలు!
ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెబుతూనే.. మరోవైపు అమెరికా భారీ సైనిక ఆపరేషన్‌కు (Iran War) తెరతీస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ను సైనికంగా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఏకంగా ‘గ్రౌండ్ ఇన్వేజన్’కు (Ground Invasion) సన్నద్ధమవుతున్నట్లు రక్షణ రంగ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లకు సెలవు దినమైన శనివారాల్లోనే ట్రంప్ యంత్రాంగం దాడులకు దిగుతున్న ట్రాక్ రికార్డు ఉండటంతో, తాజా పరిణామాలు పశ్చిమాసియాలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
ముప్పును ధృవీకరిస్తున్న ‘పిజ్జా మీటర్’
అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ (Pentagon) చుట్టుపక్కల అకస్మాత్తుగా పిజ్జాల విక్రయాలు భారీగా పెరిగితే.. అది కచ్చితంగా ఒక పెద్ద సైనిక ఆపరేషన్‌కు ముందస్తు సంకేతమే (దీనినే పిజ్జా మీటర్ అంటారు). గతంలో అమెరికా చేసిన ఏ పెద్ద యుద్ధం (Iran War) ముందు చూసినా ఈ ట్రెండ్ కనిపించింది. తాజాగా గురువారం రాత్రి పెంటగాన్ పరిసరాల్లోని పిజ్జా షాపుల్లో అమ్మకాలు ఏకంగా 200 శాతం మేర పెరగడం ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాత్రింబవళ్లు సైనికాధికారులు అత్యవసర సమావేశాల్లో ఉన్నారనడానికి ఇది నిదర్శనం. మరో 10 వేల మంది సైనికులను పశ్చిమాసియాకు పంపేందుకు పెంటగాన్ సిద్ధంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇవి కూడా చదవండి
అమెరికా ముందు మూడు టార్గెట్లు
కేవలం వైమానిక దాడులతో సరిపెట్టకుండా, ఇరాన్ గడ్డపై (Iran War) నేరుగా కాలు మోపి ఈ కింది మూడు ప్రధాన లక్ష్యాలను (Targets) పూర్తి చేయాలన్నది అమెరికా ప్లాన్‌గా తెలుస్తోంది.
ఖేష్మ్ దీవి (Qeshm Island) ఆక్రమణ: పర్షియన్ గల్ఫ్‌లో అతిపెద్దదైన ఈ దీవి వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. ఇరాన్ ఇక్కడి అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో భారీ సంఖ్యలో యాంటీ-షిప్ మిసైల్స్, మైన్స్, డ్రోన్లను దాచింది. దీనిని పదాతిదళాలతో దాడిచేసి స్వాధీనం చేసుకుంటే ‘హోర్ముజ్ జలసంధి’ పూర్తిగా అమెరికా గుప్పిట్లోకి వస్తుంది.
ఖార్గ్ దీవి (Kharg Island) దిగ్బంధనం: ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ దీవి నుంచే జరుగుతాయి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దీనిని అమెరికా వశం చేసుకుంటే ఆ దేశ ఆర్థిక మూలాలు కుప్పకూలడం ఖాయం.
యురేనియం (Uranium) స్వాధీనం: ఇరాన్ ఇంతకాలం అత్యంత రహస్యంగా, కష్టపడి శుద్ధి చేసిన దాదాపు 400 కిలోల అణు సామగ్రిని (యురేనియం) స్వాధీనం చేసుకోవడం లేదా పూర్తిగా ధ్వంసం చేయడం అమెరికా మూడో లక్ష్యం.
తమ దీవుల్లో ఒకదానిని ఆక్రమించేందుకు శత్రువులు కుట్ర పన్నుతున్నారని ఇప్పటికే ఇరాన్ (Iran War) సైన్యం కూడా ప్రకటించడం గమనార్హం. ఏ క్షణంలోనైనా ఇరాన్ గడ్డపై అమెరికా బూట్ల చప్పుడు వినపడే అవకాశం ఉందని యుద్ధ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








