గ్యాస్ సిలిండర్ లెవల్ చెక్ చేయడానికి స్మార్ట్ చిట్కాలు

30th March 2026

White Scribbled Underline

వంట మధ్యలో అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో ముందే తెలుసుకోండి:

తడి గుడ్డ పరీక్ష: సిలిండర్‌ను తడి గుడ్డతో పూర్తిగా తుడవండి. రెండు నిమిషాల తర్వాత గమనిస్తే, గ్యాస్ లేని పైభాగం త్వరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న కింది భాగం ఇంకా తడిగానే ఉంటుంది. దీనికి కారణం లోపల ఉన్న లిక్విడ్ గ్యాస్ ఆ భాగాన్ని చల్లగా ఉంచడమే.

చాక్ పీస్ పద్ధతి: ఒక తడి చాక్ పీస్‌తో సిలిండర్ పైనుంచి కిందకు ఒక గీత గీయండి. గ్యాస్ లేని చోట గీత త్వరగా ఎండిపోతుంది, గ్యాస్ ఉన్న చోట తడిగానే ఉంటుంది.

మంట రంగును గమనించండి: మీ స్టౌ మంట నీలి రంగు నుండి నారింజ (Orange) రంగులోకి మారుతుంటే, గ్యాస్ అయిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం.

శబ్దం ద్వారా: సిలిండర్ పైభాగంలో మెల్లగా తడితే 'టంగ్' అని ఖాళీ శబ్దం వస్తుంది. గ్యాస్ ఉన్న చోట తడితే శబ్దం కొంచెం భారంగా (Dull Sound) వస్తుంది.

స్మార్ట్ గేడ్జెట్స్: మార్కెట్లో దొరికే మాగ్నెటిక్ గ్యాస్ లెవల్ ఇండికేటర్లు లేదా ప్రెజర్ గేజ్ ఉన్న రెగ్యులేటర్లు వాడటం ద్వారా రీడింగ్‌ను నేరుగా చూసి తెలుసుకోవచ్చు.

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందే తెలుసుకోవచ్చు. దీంతో వంట మధ్యలో వచ్చే ఇబ్బందులను సులభంగా నివారించవచ్చు.