ట్రంప్ వాడే ఊతపదాన్నే తిరిగి వాడుతూ కౌంటర్ ఇచ్చిన IRGC
అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం ఇస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పందించింది. ట్రంప్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిజానికి ట్రంప్ కి ఊతపదం ‘‘యూ ఆర్ ఫైర్డ్’’. దీనిని తరుచుగా ఉపయోగిస్తుంటారు. ఈ పదాన్నే ఇప్పుడు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రయోగించింది. ‘‘హే ట్రంప్ యూ ఆర్ ఫైర్డ్’’. ఈ విషయంపై మీరు దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు అంటూ ఐఆర్ జీసీ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. అందులో ఈ పదం వుంది.
ఇవి కూడా చదవండి
48 గంటల్లోగా ఇరాన్ ఎటువంటి బెదిరింపు లేకుండా హర్మూజ్ జలసంధిని(Hormuz )తెరవకపోతే, ఆ దేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా మరోసారి పోస్ట్ చేశారు. కాగా, అంతకుముందు ట్రంప్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. ట్రూత్ సోషల్ వేదికగా డోనాల్ట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ద్వారా తమ లక్ష్యాలకు చేరువైనట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్య గురించి ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.
ఇవి కూడా చదవండి








