నాటో సభ్య దేశాలతో భారత్ కు సమాన హోదా!

నాటో సభ్య దేశాలతో భారత్ కు సమాన హోదా!

13-04-2019

నాటో సభ్య దేశాలతో భారత్ కు సమాన హోదా!

భారత్‌ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించని బిల్లును అమెరికా చట్టసభ సభ్యుల బృందం ఒకటి తమ దేశ ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో పున ప్రవేశపెట్టింది. నాటో సభ్య దేశాలతో సమాన హోదాను భారత్‌కు కల్పించాలన్నది ప్రతిపాదిత బిల్లు సారాంశం. అధికార, విపక్ష పార్టీలకు చెందిన అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు సభ్యుల బృందం ప్రతిపాదిత బిల్లు- హెచ్‌ఆర్‌ 2123ని సభ ముందుకు తీసుకురావటంతో కీలకంగా వ్యవహరించింది. ఈ బిల్లు కాంగ్రెస్‌ ఆమోదం పొందితే వ్యూహాత్మక ఆయుధాల విక్రయంలో భారత్‌కు ప్రాధాన్యం లభిస్తుంది.

అమెరికా నేతృత్వంలోని నాటో సభ్య దేశాలైన ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్‌ న్యూజిలాండ్‌లతో సమాన హోదా లభిస్తుంది. విదేశీవ్యవహారాల కమిటీలో సీనియర్‌ సభ్యుడైన జో విల్సన్‌ ప్రతినిధులతో సభలో బిల్లును ప్రవేశపెట్టారు. భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. హిందూమహాసముద్ర ప్రాంతంలో సుస్థిరతకు మూలస్తంభం వంటిది. ఆయుధాల ఎగుమతి నియంత్రణ విధానాల్లో ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తుంది అని ఆయన తెలిపారు.