ఏప్రిల్ 26న లూయిస్విల్లేలో టాంటెక్స్ కవి సమ్మేళనం
TANTEX: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) తన సాహిత్య వేదిక ‘నెలనెలా తెలుగు వెన్నెల’ ద్వారా మరో అపురూప ఘట్టానికి వేదిక కానుంది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని సంస్థ తన 225వ సాహిత్య సదస్సును ఏప్రిల్ 26వ తేదీన ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక “ఉగాది కవి సమ్మేళనం” ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: ఏప్రిల్ 26, 2026 (ఆదివారం)
- సమయం: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు (CST)
- వేదిక: 2681 MacArthur Blvd, Suite#204, Lewisville TX 75067.
పాల్గొనే విధానం..
సాహిత్యాభిమానులు నేరుగా వేదిక వద్దకు వచ్చి లేదా వర్చువల్ పద్ధతిలో జూమ్ లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జూమ్ ద్వారా హాజరయ్యే వారు
మీటింగ్ ఐడి: 788 250 6018,
పాస్కోడ్: 432781 ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
నిర్వాహక బృందం..
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, ఉత్తరాధ్యక్షులు ఉదయ్ కిరణ్ నిడిగంటి, ఉపాధ్యక్షులు సునీల్ సునరరాజు, కార్యదర్శి ఎస్.కె.ఎస్.రాజు, కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయి మరియు సమన్వయకర్త దయాకర్ మాడ కోరుతున్నారు.
కార్యక్రమ సమన్వయకర్త దయాకర్ మాడ , మాతృభాషను ప్రేమించే తెలుగు వారందరినీ ఈ సాహిత్య వేడుకకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు sahityavedika@tantex.org ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదించి, భాషా వికాసానికి తోడ్పడాలని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కోరుతోంది.








