ఉదారత చాటుకున్న ఎన్ఆర్ఐ రవి పొట్లూరి.. ఇంజినీరింగ్ చదువు కోసం 50 వేల ఆర్థిక సాయం
ఎన్ఆర్ఐ రవి పొట్లూరి తన ఉదారతను చాటుకున్నారు. ఉన్నత చదువులు చదవాలనుకొని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వారి కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ 3వ సంవత్సరం (థర్డ్ ఇయర్) చదువుతున్న విద్యార్థిని సి. శ్రావణి విద్యాభ్యాసం కోసం ఆయన రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ ఆర్థిక సహాయాన్ని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ప్రముఖ నేత గౌరు వెంకటరెడ్డి చేతుల మీదుగా విద్యార్ధిని శ్రావణికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రవి పొట్లూరి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో మరింత రాణించాలని విద్యార్థినికి సూచించారు. తన చదువుకు అండగా నిలిచిన రవి పొట్లూరికి, సహాయాన్ని అందించిన గౌరు దంపతులకు విద్యార్థిని శ్రావణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ సందర్భంగా పొట్లూరిరవి మాట్లాడుతూ.. ఓ ప్రతిభావంతురాలైన విద్యార్థిని చదువుకోవడానికి తన వంతు చిన్న సహాయం అందించే అవకాశం తనకు లభించడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు.
వీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న సి. శ్రావణి అనే విద్యార్థిని చదువుకు తోడ్పాటుగా, ఆమెకు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాను.నా తరపున శ్రావణికి ఈ ఆర్థిక సహాయాన్ని అందించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి గౌరు వెంకట్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్క ప్రతిభావంతురాలైన విద్యార్థిని కలలకు అడ్డుగా నిలవకూడదు. శ్రావణి భవిష్యత్తు ఉజ్వలంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అభినందనలు తెలిపారు.







