నాట్స్ చెస్ టోర్నీ.. ఏప్రిల్ 26న పిట్స్‌బర్గ్‌లో పోటీలు!
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్బర్గ్ చాప్టర్, పిట్స్బర్గ్ చెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘USCF రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2026’ నిర్వహించనున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు (Adults & Kids) అందరికీ ఓపెన్‌గా నిర్వహించే ఈ పోటీలు చదరంగంలో ప్రతిభను చాటేందుకు ఒక వేదికగా నిలవనుంది.
పోటీల వివరాలు..
- తేదీ: ఏప్రిల్ 26, 2026 (ఆదివారం).
- సమయం: ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.
- వేదిక: 400 Cayuga Cir, Mars, PA.
- టోర్నమెంట్ రకం: ఫోర్ రౌండ్ G/30 స్విస్ టోర్నమెంట్.
USCF మెంబర్షిప్..
ఈ పోటీలలో పాల్గొనే అభ్యర్థులకు ప్రస్తుత USCF మెంబర్షిప్ తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ వివరాలు..
- ప్రారంభం: ఏప్రిల్ 3, 2026.
- ముగింపు: ఏప్రిల్ 23, 2026.
- ఫీజు: నాట్స్ సభ్యులకు $25, సభ్యులు కాని వారికి $30.
- లింక్: natsworld.org/pghchess2026
బహుమతులు:
విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేస్తారు.
- ప్రథమ బహుమతి: $100 + ట్రోఫీ.
- ద్వితీయ బహుమతి: $75 + ట్రోఫీ.
ఈ కార్యక్రమాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి పర్యవేక్షణలో పిట్స్బర్గ్ చాప్టర్ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.








