NATA: న్యూజెర్సీలో మార్చి 6న ఘనంగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ వేడుకలు
ఎడిసన్ (న్యూజెర్సీ): యుఎస్ ఈవెంట్స్ (US Events), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATA) సంయుక్తంగా న్యూజెర్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. “మహిళల శక్తి, ధైర్యం, సామర్థ్యాన్ని వేడుక చేసుకుందాం” అనే నినాదంతో ఈ కార్యక్రమం మార్చి 6, 2026 శుక్రవారం సాయంత్రం 6:00 గంటల నుండి ఎడిసన్‌లోని ‘రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్’ (Royal Albert Palace, 1050 King George’s Post Road, Edison, NJ 08863) వేదికగా జరగనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, డిజె మ్యూజిక్, డ్యాన్స్, మహిళా ప్రముఖుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు, షాపింగ్ మేళా, ఆటలు, రాఫిల్ డ్రా వంటి అనేక ఆకర్షణలు ఉండనున్నాయి. అంతేకాకుండా, ఈ కార్యక్రమం ద్వారా ‘సేవ్ ద వీవర్స్’ (Save The Weavers) సంస్థకు మద్దతు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
టికెట్ వివరాలు:
ఒక్కొక్కరికి: $40
10 మంది బృందానికి: $350 (ఆహారం మరియు పానీయాలు కలిపి)
ఫిబ్రవరి 10వ తేదీ లోపు బుక్ చేసుకుంటే ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ వేడుక నిర్వహణలో ఉషారాణి చింత నేతృత్వంలోని న్యూజెర్సీ మహిళా బృందం కృషి చేస్తోంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఈ ఈవెంట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మరిన్ని వివరాల కోసం పోస్టర్లో ఉన్న ఫోన్ నంబర్లను లేదా క్యూఆర్ (QR) కోడ్‌ను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి








