అమెరికాలో మహిళల కోసం ప్రత్యేక తెలుగు సంఘం
అమెరికాలోని మహిళలకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు సంఘాన్ని టాటా మాజీ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఏర్పాటు చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ పేరుతో ఈ సంఘాన్ని ఆమె ఉమెన్స్ డే రోజున ప్రకటించారు. ఇది తెలుగు మహిళల కోట అని, స్త్రీ ప్రగతి పథమే మా బాట అని కూడా ఆమె లోగోలో పేర్కొన్నారు. ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్ చైర్, ప్రెసిడెంట్ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు. మహిళలకు ఇప్పుడు ఉన్న సంఘాల్లో తగు న్యాయం జరగలేదన్న ఉద్దేశ్యంతో ఆమె ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.













