Mangala Kuppa: అమెరికాలో మన తెలుగింటి వెలుగు.. కార్మిక శాఖ సీఐవోగా మంగళ కుప్పా!
Mangala Kuppa: అమెరికా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన మరో సాంకేతిక నిపుణురాలు కీలక బాధ్యతలు చేపట్టారు. అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) ముఖ్య సమాచార అధికారి (Chief Information Officer – CIO)గా భారత సంతతికి చెందిన మంగళ కుప్పా నియమితులయ్యారు. గత ఏడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో ఈ పదవిలో కొనసాగుతున్న ఆమెకు, ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించారు.
ఇవి కూడా చదవండి
ఏఐ విభాగానికి కూడా నేతృత్వం:
సీఐవో బాధ్యతలతో పాటు, ఈ నెల ప్రారంభం నుంచి కార్మిక శాఖ విభాగానికి ముఖ్య కృత్రిమ మేధస్సు (Chief AI Officer) అధికారిగా కూడా ఆమె నియామకం జరిగింది. తన కొత్త బాధ్యతల్లో భాగంగా సమాచార సాంకేతిక వ్యూహం, డిజిటల్ పరివర్తన , ఏఐ (AI) వినియోగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు.
అపారమైన అనుభవం:
టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా మంగళ కుప్పాకు సుమారు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె 2010లో కార్మిక శాఖలో చేరారు. అప్పటి నుండి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పదవులను సమర్థవంతంగా నిర్వహించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి








