రాజు గారికి ఆదర్శ కుటుంబం హక్కులు దక్కేనా?
టాలీవుడ్లో నిర్మాత దిల్‌రాజు(Dil Raju), యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ(Naga Vamsi)ల మధ్య ఉన్న సన్నిహిత వ్యాపార సంబంధాల గురించి ఇండస్ట్రీలో చాలాకాలంగా డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika & Hassinee Creations), సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మించిన ఎన్నో సినిమాల నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు వరుసగా దిల్‌రాజు చేతుల్లోనే ఉండేవి. నాగవంశీ కూడా పలు వేదికలపై దిల్రాజును తనకు ఇన్సిపిరేషన్ గా భావిస్తున్నట్లు పేర్కొనడం, వీరి మధ్య ఉన్న పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబించింది. అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్నాయనే సంకేతాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం నాగవంశీ తన రాబోయే ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. నైజాం రైట్స్ ను దిల్‌రాజుకు ఇవ్వకుండా ఇతర పంపిణీ వ్యవస్థలను పరిశీలిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మార్పుకు అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఇది పూర్తిగా బిజినెస్ డెసిషనా లేక సంబంధాల్లో వచ్చిన మార్పా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వెలువడలేదు.
ఈ నేపథ్యంలో వెంకటేష్(venkatesh) హీరోగా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam) నైజాం థియేట్రికల్ రైట్స్ ఇంట్రెస్టిగ్ గా మారాయి. ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేసే అవకాశాన్ని దక్కించుకోవడానికి దిల్‌రాజు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని ఈ నేపథ్యంలోనే నిర్మాత రాధాకృష్ణ(Radhakrishna), డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram)తో ఇటీవల డిస్కషన్స్ జరిగినట్లు సమాచారం. అక్టోబర్ 2 రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా రైట్స్ పై డెసిషన్ ఇంకా వెలువడకపోవడంతో, నైజాం డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లో ఉత్కంఠ కొనసాగుతోంది.








