భారీ రేటుకు జైలర్2 డిజిటల్ రైట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) నటిస్తున్న జైలర్2(Jailer2) రిలీజ్ కు ముందే ముందే డిజిటల్ మార్కెట్లో భారీ డిస్కషన్ కు కారణమవుతోంది. సినీ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video) దాదాపు రూ.160 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాకపోయినా, ఈ డీల్ నిజమైతే సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాల్యుబుల్ డిజిటల్ డీల్స్ లో ఒకటిగా జైలర్2 నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జైలర్ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా మంచి ఆదరణ పొందింది. అదే సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్‌కు మరింత భారీ ప్రీమియం లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2026 అక్టోబర్ 15న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా గణనీయమైన ఆదాయం రావడం నిర్మాతలకు బలమైన ఆర్థిక భరోసా కల్పించే అంశంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్.జె. సూర్య(SJ Surya),రమ్యకృష్ణ(Ramya Kirshna), యోగి బాబు(Yogi Babu) కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ డిజిటల్ డీల్ వార్తలతో జైలర్2పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. థియేట్రికల్ కలెక్షన్లకు ముందే ఇంత పెద్ద స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం, రజినీకాంత్ మార్కెట్ బలం ఇంకా ఎంత ప్రభావవంతంగా ఉందో సూచిస్తున్న సంకేతంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








