NBK: భలే టైటిల్ ను పట్టేసిన బాలయ్య
టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) తన కెరీర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, రీసెంట్ గా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో రూపొందిన అఖండ2(Akhanda2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichand malineni)తో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక గోపీచంద్ ప్రాజెక్ట్ అనంతరం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(vivek athreya)తో జట్టు కట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. విభిన్నమైన కథన శైలితో గుర్తింపు పొందిన ఆత్రేయ, అంటే సుందరానికి(Ante sundaraniki), సరిపోదు శనివారం(Saripoda Sanivaram) వంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి డైరెక్టర్ బాలయ్య(Balayya)ను ఎలా ప్రెజెంట్ చేస్తారన్న ఆసక్తి సినీ వర్గాల్లో పెరుగుతోంది. ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కథ, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఈ ప్రాజెక్ట్‌కు కురుక్షేత్రం(Kurukshetram) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు చూస్తే పౌరాణిక నేపథ్యం గుర్తుకు వస్తున్నప్పటికీ, ఆధునిక కాలానికి అనుగుణంగా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీకి, ఆత్రేయ నెరేషన్ స్టైల్ కలిస్తే కొత్త తరహా సినీ అనుభూతి దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి








