ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్
థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సూర్య(Suriya) తాజా సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & sons) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఆగస్టులో రిలీజై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సూర్య యాక్టింగ్‌తో పాటు కథలోని ఎమోషన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సినిమా థియేట్రికల్ జర్నీ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, సెప్టెంబర్ 11 నుంచి సినిమా డిజిటల్‌గా అందుబాటులోకి రానుంది. తమిళ్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందనున్నారు.
మమితా బైజు(Mamitha baiju) హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్(Fortune Four Cinemas) నిర్మించాయి. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ ఫ్యామిలీ డ్రామా ఓటీటీ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమాకు మరింత విస్తృతమైన ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.








