ఈ వినాయకచవితికి రిలీజవుతున్న మూవీస్ ఇవే!
ఈ వారం పలు సినిమాలు రిలీజైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సందడి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. అయితే వచ్చే వారం పరిస్థితి పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో వరుసగా ఐదు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో వినాయక చవితి ముందు మూవీ లవర్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లైనప్ సిద్ధమైంది. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా, మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కావడం విశేషం.
సెప్టెంబర్ 10న సూరి(Soori) ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ మండాడి(Mandadi) రిలీజ్ కానుంది. ఇందులో సుహాస్(Suhas) కీలక పాత్ర పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అదే రోజు కార్తీ(Karthi) నటించిన భారీ సీక్వెల్ సర్దార్2(Sardar2) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం తెలుగు, తమిళ భాషల్లో మంచి సక్సెస్ సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రవితేజ(Raviteja)కు కొడుకు వరసైన మాధవ్ భూపతిరాజు(Madhav bhupathiraju) నటించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ మారెమ్మ(maaremma) కూడా అదే రోజు రిలీజ్ కానుండగా, టీజర్‌తో ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది.
సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(vaishnavi chaitanya) జంటగా నటించిన ఎపిక్(Epic), సుమంత్(Sumanth) నటించిన మహేంద్రగిరి వారాహి(Mahendragiri Varahi) రిలీజ్ కానున్నాయి. ట్రైలర్‌తో ఎపిక్ ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, ఈ వారంలోని సినిమాల్లో దీనికే అత్యధిక హైప్ కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాల్లో సర్దార్2 కు స్పష్టమైన అడ్వాంటేజ్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా మంచి కంటెంట్, పాజిటివ్ టాక్ దక్కితే ఈ ఐదు సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.








