ప్రీ రిలీజ్ బిజినెస్ లో వారణాసి రికార్డులు
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కలయికలో రూపొందుతున్న వారణాసి(Varanasi) సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కు సంబంధించిన డిస్కషన్స్ ఫిలింనగర్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కుల కోసం రూ.320 కోట్లకు మించిన ఆఫర్లు వినిపిస్తున్నాయనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ లెక్కలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా వెలువడలేదు.
రాజమౌళి గత సినిమాల అంతర్జాతీయ సక్సెస్‌లు, మహేష్ బాబు స్టార్డమ్ కలిసి వారణాసికి అసాధారణమైన మార్కెట్‌ను తీసుకొచ్చాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇతర భారతీయ భాషల మార్కెట్లతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా విశేషమైన ఆసక్తి ఉందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్స్ ఈ ప్రాజెక్ట్ స్థాయిని స్పష్టం చేస్తున్నాయి. సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుండటంతో ఈ సినిమాకు భారీ ప్రచారం లభిస్తోంది.
మహేష్ బాబు ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, ప్రియాంక చోప్రా(Priyanka chopra), పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా చివరి దశకు చేరినట్లు సమాచారం. ఉగాది సందర్భంగా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కు రెడీ అవుతున్న వారణాసి, రిలీజ్ కు ముందే తెలుగు సినిమా వ్యాపారంలో కొత్త రికార్డులకు సంకేతాలు ఇస్తోందనే డిస్కషన్ సాగుతోంది.








