2028కు వాయిదా పడిన రామాయణం రెండో భాగం!
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ(ramayana) మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాత నమిత్ మల్హోత్రా(namith malhotra), డైరెక్టర్ నితేశ్ తివారీ(nitesh tiwari) సంయుక్తంగా ఈ భారీ పౌరాణిక సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తుండగా, రెండో భాగాన్ని దీపావళి 2027 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గతంలో ప్లాన్ చేశారు. అయితే ప్రభాస్(prabhas), సందీప్ రెడ్డి వంగా(sandeeo reddy vanga) కాంబినేషన్లో రూపొందుతున్న స్పిరిట్(spirit) అదే సమయంలో రిలీజ్ కానున్న నేపథ్యంలో రామాయణ రెండో భాగం వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది.
ఈ ఊహాగానాలకు నిర్మాత నమిత్ మల్హోత్రా(namith malhotra) తాజాగా తెరదించారు. రామాయణ రెండో భాగం 2027లో రిలీజ్ కావడం లేదని అధికారికంగా వెల్లడించారు. సినిమా విషయంలో తొందరపడే ఆలోచన తమకు లేదని, ఆడియన్స్ కు అత్యుత్తమమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించడమే తమ మెయిన్ టార్గెట్ అని క్లారిటీ ఇచ్చారు. కేవలం రిలీజ్ డేట్ కోసం సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని, వచ్చే నెలలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రణబీర్ కపూర్(ranbir kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి(Sai pallavi) సీతాదేవిగా, యష్(Yash) రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ పై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినప్పటికీ, 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.







