Allu Arjun-Atlee: బన్నీ-అట్లీ మూవీలో ఆ హీరోయిన్?
అల్లు అర్జున్(allu arjun)- అట్లీ(atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ డిస్కషన్స్ కు దారితీస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో వస్తున్న వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ(anushka sharma) ఈ సినిమాలో భాగమవుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే నిజమైతే, చాలా కాలం తర్వాత అనుష్క వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె(deepika padukone), రష్మిక మందన్నా(rashmika mandanna), మృణాల్ ఠాకూర్(mrunal thakur), జాన్వీ కపూర్(janhvi kapoor) లాంటి స్టార్లు నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడీ లిస్ట్ లో అనుష్క శర్మ(Anushka Sharma) కూడా చేరితే, ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించబోతున్నారని అర్థం. అయితే ఇంత పెద్ద కాస్టింగ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ సరైన ప్రాధాన్యత దక్కుతుందా అనే సందేహాలు ఇప్పుడు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేవలం మార్కెట్ వ్యూహంగా బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారా అనే చర్చలు కూడా నెటిజన్లలో కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అయితే, ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది మాత్రం అల్లు అర్జున్ పాత్రేనని అభిమానులు విశ్వసిస్తున్నారు. హీరోలను శక్తివంతంగా చూపించడంలో అట్లీకి ఉన్న నైపుణ్యం దృష్ట్యా, కథ బన్నీ చుట్టూనే తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మిగతా క్యారెక్టర్లకు కూడా సముచిత స్థానం కల్పిస్తేనే సినిమా సమతుల్యంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
![]()
ఇవి కూడా చదవండి








