AA22: బన్నీ బర్త్ డేకు ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) పుట్టినరోజు ప్రతీ ఏడాది ఫ్యాన్స్‌కు పండగలా మారిపోతుంది. ఈసారి ఆ సెలబ్రేషన్ మరింత స్పెషల్ కానుంది. అట్లీ(atlee) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22 నుంచి ఏప్రిల్ 8న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించనుంది. అయితే బర్త్‌డే సందర్భంగా విడుదలయ్యే ఈ గ్లింప్స్ ద్వారా సినిమా కథాంశం, జానర్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది.
భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్(sun pictures) నిర్మిస్తున్న ఈ మెగా మూవీకి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం. కథ, యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నింటిలోనూ హై స్టాండర్డ్స్ పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకొణె(deepika padukone) మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో భాగమనున్నారని తెలుస్తోంది.

అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్, హై వోల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ నెలకొంది. కాబట్టి ఈసారి బన్నీ బర్త్‌డే ట్రీట్ సాధారణ టీజర్ కాకుండా, సినిమాకి టోన్ సెట్ చేసే పవర్ఫుల్ గ్లింప్స్‌గా ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏప్రిల్ 8న విడుదలయ్యే ఈ టీజర్ కొత్త రికార్డులకు నాంది పలకడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








