Divya Dutta: ఆ డెసిషన్ వల్లే నటిగా ఈ స్థాయిలో ఉన్నా
బాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన దివ్యా దత్తా(Divya dutta) ప్రస్తుతం చిరాయా(chiraya) వెబ్ సిరీస్‌తో మళ్లీ చర్చల్లో నిలిచింది. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ మంచి స్పందన అందుకుంటోంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా బలమైన పాత్రలను ఎంచుకుంటూ, తన నటనా పరిధిని విస్తరించుకుంటున్న దివ్యా, మరోసారి తన టాలెంట్‌ను నిరూపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఆమె కెరీర్లో అసలు మలుపు తీసుకొచ్చింది వీర్ జారా(Veer zaara) సినిమా. ఆ సినిమా తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో ఒకేసారి అనేక ప్రాజెక్టులకు సైన్ చేసిన దివ్యా, తర్వాత తన నిర్ణయాలపై ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా(Aditya chopra) ఇచ్చిన సూచన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసినట్టు చెప్పింది దివ్యా. డబ్బు కోసం పనిచేస్తావా, లేక నటిగా గుర్తింపు కోసం? అనే ప్రశ్న తనను లోతుగా ఆలోచించేలా చేసిందని చెప్పింది.
దాంతో ఆమె ధైర్యంగా కొన్ని సినిమాల నుంచి తప్పుకుని, తీసుకున్న అడ్వాన్స్‌లను కూడా తిరిగి ఇచ్చేసింది. ఈ నిర్ణయం రిస్క్‌గా కనిపించినప్పటికీ, అదే ఆమెను కంటెంట్ ప్రధానమైన పాత్రల వైపు నడిపించింది. తర్వాత ఆమె ఎంపిక చేసిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, ఇరాదా(Iraada) సినిమాకు నేషనల్ అవార్డును కూడా తీసుకొచ్చాయి. ఈ రోజు తాను ఉన్నత స్థాయికి చేరడానికి ఆ సలహానే కారణమని దివ్యా చెబుతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి








