Twinkle Khanna: టైమ్ ను ఎలా వాడుకోవాలో చెప్పిన ట్వింకిల్ ఖన్నా
బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా(twinkle Khanna) వెయిటింగ్ టైమ్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పిన సూచనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. షూటింగ్ సెట్స్‌లో తరచుగా ఉండే ఖాళీ సమయాన్ని చాలామంది నిరుత్సాహంగా గడిపేస్తుంటారు. అయితే, అదే సమయాన్ని యాక్టివ్‌గా మార్చుకుంటే శారీరకంగా, మానసికంగా లాభం ఉంటుందని ట్వింకిల్ అభిప్రాయపడుతున్నారు. సమయం దొరికితే అలసటగా కూర్చోకుండా, దాన్ని చిన్నచిన్న పనులతో ఉత్పాదకంగా మార్చుకోవడం ముఖ్యం అని ఆమె చెబుతున్నారు.
ఈ క్రమంలో ఆమె పాటించే కొన్ని సింపుల్ అలవాట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందు టైమ్ ఉంటే మెట్లను జిమ్‌లా ఉపయోగించి తేలికపాటి వ్యాయామాలు చేస్తానని చెప్పారు. అలాగే యోగా, ముఖ్యంగా భ్రమరి ప్రాణాయామం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని వివరించారు. ఇవి కేవలం ఫిట్‌నెస్‌కే కాకుండా, ఫోకస్ మరియు ఎనర్జీని పెంచడంలో కూడా సహాయపడతాయని ఆమె సూచించారు.
ఇక వెయిటింగ్ టైమ్‌ను క్రియేటివ్‌గా ఉపయోగించుకోవడంపైన కూడా ట్వింకిల్ దృష్టి సారించారు. పాటలు పాడటం, కొత్త ఆలోచనలను నోట్ చేసుకోవడం వంటి అలవాట్లు స్ట్రెస్ తగ్గించడమే కాకుండా ప్రొడక్టివిటీని పెంచుతాయని చెప్పారు. అంతేకాకుండా, రోజువారీ జీవితానికి ఉపయోగపడే చిన్న ట్రిక్స్.. హెయిర్ డ్రయర్‌తో బట్టల మడతలు సర్దుకోవడం వంటి వాటిని కూడా ఆమె షేర్ చేసుకున్నారు. మొత్తంగా, ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా చిన్న అలవాట్లతో పెద్ద మార్పులు సాధించవచ్చని ట్వింకిల్ ఖన్నా సందేశం స్పష్టంగా చెబుతోంది.
ఇవి కూడా చదవండి








