సింగర్ సునీత సినిమాల్లో….
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్ అన్న, అమ్మ, నాన్న వరుసగా కన్నుమూయడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు మహేష్ బాబు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందట. ఈ సినిమాలో తన మధురమైన పాటలతో ఎంతో ప్రేక్షకాభిమానులని సొంతం చేసుకున్న సింగర్ సునీత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబి 28అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు అక్కగా సునీత నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా ఆమెకూడా ఓకే చెప్పినట్టు వార్త.













