ప్రమోషన్స్ లో వెనుకబడిన రామాయణ
ఇండియన్ ఆడియన్స్ కు రామాయణ అంటే కేవలం ఒక పురాణగాథ కాదు.. ఎమోషన్స్ తో ముడిపడిన మహాకావ్యం. అలాంటి కథను ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించేందుకు నిర్మాత నమిత్ మల్హోత్రా(namith malhotra) భారీ ప్రణాళికతో ముందుకొచ్చారు. దంగల్(Dangal) ఫేమ్ నితేశ్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి(Sai pallavi), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny deol), రావణుడిగా యష్(Yash) నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించిన ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే రిలీజ్ కు కేవలం మూడు వారాల టైమ్ మాత్రమే ఉండటంతో సినిమాపై నెలకొనాల్సిన స్థాయి హైప్ ఇంకా కనిపించడం లేదు. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలకు తగిన స్థాయిలో ఆసక్తిని రేకెత్తించలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మేకర్స్ చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే ప్రమోషనల్ కంటెంట్ రెగ్యులర్ గానే ఉండటం చర్చనీయాంశంగా మారింది. వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాపై సహజంగానే ప్రేక్షకులు అసాధారణమైన విజువల్ అనుభూతిని ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న రామాయణకు బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ స్టేజ్ ప్రమోషన్స్ సినిమాకు కీలకం కానున్నాయి. సోషల్ మీడియాలో డిస్కషన్స్ పెరగడంతో పాటు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే కంటెంట్ను మేకర్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. మరి రాబోయే రోజుల్లో రామాయణ ప్రమోషన్స్ స్పీడ్ పుంజుకుని, రిలీజ్ టైమ్ కు భారీ ఓపెనింగ్స్కు బాటలు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.








