రవితేజ రెమ్యునరేషన్తో తులాభారంకు భారీ రిస్క్!
వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ(Ravi Teja).. కొంతకాలంగా సినిమాల ఎంపిక, రెమ్యునరేషన్ విషయంలో కొత్త పంథాను అనుసరించినట్లు ప్రచారం జరిగింది. నిర్మాతలకు భారం కాకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆయన, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండాలని భావించారు. ఈ క్రమంలో ఇరుముడి రిలీజ్ కు ముందే దిల్ రాజు(Dil Raju), లక్ష్మణ్ (laxman) లతో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఇరుముడి రిజల్ట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ ఆశిస్తున్న రవితేజతో ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్ సరిపోకపోవడంతో దిల్ రాజు ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు టాక్.
మరోవైపు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కనున్న తులాభారం కోసం రవితేజ ఏకంగా రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో నైజాం థియేట్రికల్ హక్కుల్లో గణనీయమైన వాటా కూడా ఉంటుందని సమాచారం. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తే ఆయనకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే డిజిటల్ హక్కుల ధరలు తగ్గడం, హిందీ శాటిలైట్, యూట్యూబ్ మార్కెట్ గతంలో లాగా ఆదాయాన్ని అందించకపోవడం నిర్మాతల లెక్కలను క్లిష్టతరం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
భారీ తారాగణం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం కూడా తులాభారం(thulabharam) బడ్జెట్ను పెంచే అంశాలుగా మారనున్నాయి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Vivek Athreya) భారీ బడ్జెట్ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ పరంగా నిర్మాతలు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో అసాధారణ విజయం సాధిస్తేనే ఈ ప్రాజెక్టు సురక్షితమైన పెట్టుబడిగా నిలిచే అవకాశముంది.








