ఇమాన్వి బర్త్‌డేకు ప్రభాస్ స్పెషల్ ట్రీట్.. ఫుడ్‌తో మరోసారి మనసులు గెలుచుకున్న డార్లింగ్!
ప్రభాస్(prabhas) అంటే ఫ్యాన్స్ కు గుర్తొచ్చేది ఆయన ఆతిథ్యం, తోటి నటీనటులపై చూపించే అభిమానం. షూటింగ్ టైమ్ లో సహనటులు, మూవీ టీమ్ కు రుచికరమైన వంటకాలతో సర్ప్రైజ్ ఇవ్వడం డార్లింగ్‌కు అలవాటు. తాజాగా ఈ లిస్ట్ లో కి హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi esmael) కూడా చేరింది. అక్టోబర్ 13న తన బర్త్ డే జరుపుకున్న ఇమాన్వికి ప్రభాస్ స్పెషల్ గా ఫుడ్ ట్రీట్ పంపించారు. ఈ సందర్భంగా తనకు అందిన విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇమాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మనసు, కడుపు రెండూ ఎప్పటికీ నిండుగా ఉంటాయి. థాంక్యూ ప్రభాస్ గారు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ప్రభాస్‌కు ఫుడ్ ను పంచడం అనేది కేవలం ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. సినిమా షూటింగ్స్‌లోనూ తనతో పనిచేసే వారికి ఇంటి నుంచి రకరకాల వంటకాలను పంపిస్తూ ఆత్మీయతను చాటుకుంటుంటారు. గతంలోనూ ఫౌజీ(fauzi) హైదరాబాద్ షెడ్యూల్ టైమ్ లో ఇమాన్వికి ప్రభాస్ ప్రత్యేక విందు పంపించారు. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. ఇప్పుడు మరోసారి బర్త్ డే సందర్భంగా ప్రభాస్ నుంచి అలాంటి ఆతిథ్యం అందడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇక ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అనుపమ్ ఖేర్(anupam kher), మిథున్ చక్రవర్తి(Mithun Chakravarthy), జయప్రద(jayaprada) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 మార్చిలో థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.








