జూబ్లీహిల్స్‌లో బాలయ్య కొత్త ఇల్లు.. విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కొత్త ఇల్లు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన ఫ్యామిలీ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఓ విలాసవంతమైన భవనం సిద్ధమవుతోంది. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండతస్తులతో ఈ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే బాలకృష్ణ ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
ఈ భవనంలో విలాసానికి పెద్దపీట వేస్తూనే కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సినిమాలను ఆస్వాదించేందుకు ప్రైవేట్ హోమ్ థియేటర్, వ్యాయామం కోసం ప్రత్యేక జిమ్, స్విమ్మింగ్ పూల్తో పాటు పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పూజా మందిరానికి కూడా ప్రత్యేక స్థానం కల్పించిన్టు సమాచారం. ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు తెలుగు సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంటిని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ వర్క్స్ ను బాలకృష్ణ భార్య వసుంధరా దేవి(Vasundhara devi) స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
2021లో ఈ స్థలాన్ని సుమారు రూ.15 కోట్ల రిజిస్ట్రేషన్ విలువతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భూమి విలువ, నిర్మాణ వ్యయం, ఇంటీరియర్ ఏర్పాట్లను కలిపి ఈ నివాసం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. మరోవైపు, బంజారాహిల్స్‌లో నాలుగు దశాబ్దాలుగా బాలకృష్ణకు చిరునామాగా ఉన్న పాత ఇంటి స్థలంలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం బాలయ్య ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో సెంటిమెంట్‌తో ముడిపడిన పాత ఇంటి నుంచి కొత్త నివాసానికి మారడం బాలకృష్ణ కుటుంబానికి ప్రత్యేక సందర్భంగా నిలవనుంది.







