మణిరత్నం కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న విజయ్ సేతుపతి!
కోలీవుడ్ లో విభిన్నమైన కథలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి(Vijay sethupathi). హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా, కీలక పాత్రల్లోనూ తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం(maniratnam) తెరకెక్కిస్తున్న ఇంజి వెల్లం సినిమాతో వార్తల్లో నిలిచారు. సాయిపల్లవి(Sai pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ ఇటీవల పూర్తైంది. 2027 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ఆయన, మణిరత్నం సినిమాకు మాత్రం అందులో సగం మాత్రమే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి కానీ, సేతుపతి నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. మణిరత్నం దర్శకత్వంలో పనిచేసే అవకాశం, కథపై నమ్మకమే ఈ డెసిషన్ కు కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు విజయ్ సేతుపతి నటించిన దాదాపు మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కు వరుసగా కొత్త సినిమాలు అందనున్నాయి. ఇక టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannadh) తెరకెక్కించిన స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog: 33 Temple Road) షూటింగ్ కూడా పూర్తైంది. ఈ సినిమా త్వరలో రిలీజయ్యే అవకాశం ఉంది. మొత్తంగా విజయ్ సేతుపతి తన విభిన్నమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తున్నారు.








