దైవ రహస్యం చుట్టూ ఉత్కంఠ.. హైందవ టీజర్ అదుర్స్!
యాక్షన్ సినిమాలతో మాస్ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఈసారి భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా హైందవ(haindhava). లుధీర్ బైరెడ్డి(ludheer byreddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దైవత్వం, ఆధ్యాత్మిక రహస్యాలు, ఉత్కంఠభరితమైన సంఘటనల కలయికతో రూపొందిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా విజువల్స్, కథా నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఒక గుడిని కేంద్రంగా చేసుకున్న గ్రామంలో చోటుచేసుకునే వింత పరిణామాలు ఈ కథకు మెయిన్ ఎట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. విష్ణుమూర్తి అవతారాలు ఆలయం నుంచి బయటకు వచ్చి ఓ పెను విపత్తును అడ్డుకుని తిరిగి వెళ్లిపోతాయనే ప్రవచనం కథలో కీలకంగా మారింది. దేవుడిని నమ్మని పోలీసాఫీసర్ గా సాయి శ్రీనివాస్ కనిపిస్తూ, భక్తి పేరుతో జరిగే వ్యవహారాలను ప్రశ్నిస్తుంటారు. మరి ఆ ప్రవచనం నిజమవుతుందా? దాని వెనుక ఉన్న రహస్యమేంటి? అనే ప్రశ్నలు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. రాజగోపురంపై విష్ణుమూర్తి రూపం సహా పలు దృశ్యాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మహేష్ మంజ్రేకర్(mahesh manjrekar), జేడీ చక్రవర్తి(JD Chakravarthy) క్యారెక్టర్లు కూడా టీజర్లో ప్రభావం చూపించాయి.
ఇవి కూడా చదవండి
సాయి శ్రీనివాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఆయన పాత్రలోని చలాకీతనం, మానవత్వం ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. సంయుక్త హీరోయిన్(Samyuktha) గా నటిస్తున్న ఈ సినిమాను మహేష్ చందు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్(Sam CS) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. దైవిక అంశాలను మిస్టరీ, థ్రిల్‌తో మేళవించిన హైందవ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.








