మొత్తానికి పెద్ది టీమ్ క్లారిటీ ఇచ్చేసిందిగా!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా, జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్గా డైరెక్టర్ బుచ్చిబాబు సానా(Buchibabu sana) తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది(peddi)పై వస్తున్న రిలీజ్ రూమర్స్‌కు మేకర్స్ అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చ్ నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడగా, ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ మార్పు ఖరారైంది. పలు వర్గాల్లో వినిపించిన గాసిప్స్ మధ్య, ప్రెస్ నోట్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులకు ఒక స్పష్టత వచ్చింది.
మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, పెద్ది సినిమా టాకీ పార్ట్ పూర్తైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆఖరి దశలో ఉన్నాయని తెలిపారు. సినిమాలో మరో పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, ఆ సాంగ్ పూర్తి అయిన వెంటనే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎడిటింగ్ చేసిన ఫుటేజ్‌ను చూసిన టీమ్ చాలా సంతృప్తిగా ఉందని, ఔట్పుట్ ఎక్స్పెక్టేషన్స్కు మించి వచ్చిందనే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ ఒక్క సాంగ్ షూట్ కారణంగానే రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇక కొత్త రిలీజ్ ప్లాన్ ప్రకారం ఈ సినిమాను జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండటం మరో హైలైట్ కాగా, వృద్ధి సినిమాస్(Vriddhi cinemas) నిర్మాణం వహిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








