పోయెస్ గార్డెన్ లో లగ్జరీ విల్లాను సొంతం చేసుకున్న నయన్
సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న నయనతార(nayanthara) మరోసారి తన లైఫ్‌స్టైల్‌తో వార్తల్లో నిలిచినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. చెన్నైలోని అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతంగా గుర్తింపు పొందిన పోయెస్ గార్డెన్లో ఆమె సుమారు రూ.40 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళ సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నివసించే ఈ ప్రాంతంలో నయనతార స్థిరపడడం విశేషంగా మారింది. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన తుది ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే ఫ్యామిలీతో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
పోయెస్ గార్డెన్‌ను చెన్నైలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఏరియాలో ఆస్తులు కలిగి ఉండటం ప్రతిష్ఠకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అక్కడ నివసిస్తుండగా, ఇప్పుడు నయనతార కూడా అదే ప్రాంతంలో విల్లాను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవలి కాలంలో సినీ తారలు ప్రైమ్ లొకేషన్లలో భారీ పెట్టుబడులు పెట్టడం పెరుగుతున్న ట్రెండ్‌గా కనిపిస్తోంది.
ఇక కెరీర్ పరంగా కూడా నయనతార ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలతో పాటు కమర్షియల్ ప్రాజెక్టులకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్న ఆమె, ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుస అవకాశాలు, భారీ రెమ్యునరేషన్, ఇప్పుడు లగ్జరీ విల్లా కొనుగోలుతో నయనతార మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.








