ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూసుకెళ్తున్న ‘నాగబంధం’.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్
అభిషేక్ నామా(Abhishek nama) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ నాగబంధం(Naga bandham) రిలీజ్‌కు ఇంకా నెల రోజుల టైమ్ మాత్రమే ఉండగా, సినిమా చుట్టూ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ముఖ్యంగా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌లో కనిపిస్తున్న విజువల్ గ్రాండియర్, హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలు సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సినిమా రిలీజ్‌కు ముందే నాగబంధం ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సంచలనం సృష్టిస్తోంది. స్ట్రీమింగ్, శాటిలైట్‌తో పాటు ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయి ధరలకు అమ్ముడైనట్లు సమాచారం. ఉత్తర భారతదేశం మరియు ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతలను జీ స్టూడియోస్(Zee studios) చేపట్టగా, తాజాగా నిజాం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు(Dil Raju) రూ.9 కోట్ల భారీ ఒప్పందంతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ డీల్ సినిమా కంటెంట్‌పై, కమర్షియల్ సామర్థ్యంపై ఇండస్ట్రీలో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, రిలీజ్‌కు ముందు దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించేందుకు చిత్ర బృందం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. పలు ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టి సినిమాను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేయాలని యోచిస్తోంది. అలాగే జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భారీ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌గా తెరకెక్కిన నాగబంధం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.








