2027 సంక్రాంతికి మెగాస్టార్ పవర్.. కాకా మేజర్ షెడ్యూల్‌కు రంగం సిద్ధం!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా కాకా(kaaka) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య(Waltair veerayya) వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
హైదరాబాద్ షెడ్యూల్లో కథకు అత్యంత కీలకమైన సీన్స్ ను సుదీర్ఘంగా చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పోల్లాచి, హైదరాబాద్‌లలో ప్రధాన భాగాల షూటింగ్ పూర్తికాగా, తాజా షెడ్యూల్‌తో నిర్మాణ కార్యక్రమాలు మరింత వేగం అందుకోనున్నాయి. ఈ సినిమాలో అనస్వర రాజన్(Anaswara Rajan), నివేదా పేతురాజ్(Nivetha pethuraj) కీలక పాత్రల్లో నటిస్తుండగా సునీల్(Suneel), గెటప్ శ్రీను(Getup srinu) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ(Venkat K. Narayana) అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్. తమన్(S. Thaman) సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్(Vijay Karthik Kannan) సినిమాటోగ్రఫీ, ఆంటోని రూబెన్(Anthony Ruben) ఎడిటింగ్, అవినాష్ కొల్లా(Avinash Kolla) ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లోహిత్ ఎన్కే(Lohith NK) క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ కాకా సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.








