కొత్త సినిమాలు వచ్చినా.. ఇరుముడిని ఆపడం కష్టమే!
రవితేజ(raviteja) హీరోగా శివ నిర్వాణ(shiva nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి(Irumudi) బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. ప్రియా భవాని శంకర్(Priya bhavani shankar), బేబీ నక్షత్ర(Nakshatra) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ప్రధానంగా తన ఎమోషనల్ స్క్రీన్‌ప్లే తో ఆకట్టుకుంటోంది. అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని కథలో సహజంగా మిళితం చేయడం సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రిలీజైన తొలి వారం నుంచే మంచి కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ సినిమా భారీ సక్సెస్‌గా నిలిచింది.
ముఖ్యంగా వీకెండ్స్‌లో ఇరుముడికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ మరింత బలంగా కనిపించింది. ఇతర భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బుకింగ్స్‌లో సినిమా మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా సినిమాకు కనెక్ట్ కావడం కలెక్షన్లకు ప్రధాన బలంగా మారింది.
ఇక తాజా వీకెండ్ లో కూడా ఇరుముడికి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ వారం పలు సినిమాలు రిలీజవుతున్నప్పటికీ వాటిలో ఏ సినిమాపైనా భారీ స్థాయి బజ్ లేకపోవడం రవితేజ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశముంది. దీంతో మరోసారి వీకెండ్ బాక్సాఫీస్‌ను ఇరుముడి శాసించే ఛాన్స్ ఉందనే అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించింది.








