Lokesh Kanagaraj: బన్నీ- లోకేష్ మూవీ సైలెంట్ గా స్టార్ట్ అయిందా?
చెన్నైలో జరిగిన ఒక అనూహ్య ఘటనతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) మరోసారి వార్తల్లో నిలిచాడు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన కూలీ(Coolie) ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోకపోయినప్పటికీ, తన తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయబోయే కొత్త సినిమా AA23 త్వరలో ప్రారంభం కానుందనే సమాచారం ఉన్న వేళ, చెన్నైలో జరిగిన ఈ సంఘటన పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తించింది.
ఇవి కూడా చదవండి
ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన సాధారణ తనిఖీ సమయంలో 10 AK-47 రైఫిళ్లు సీజ్ చేయడం మొదట పెద్ద సంచలనంగా మారింది. తర్వాత వెంటనే అవి నిజమైనవేనా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో, వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, తర్వాత జరిగిన దర్యాప్తులో ఆ రైఫిళ్లు అసలు ఆయుధాలు కాకుండా సినిమా షూటింగ్ కోసం వాడే డమ్మీ గన్స్ అని అధికారులు స్పష్టం చేశారు. ఇవి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ప్రాపర్టీస్‌గా గుర్తించారు.
చిత్ర యూనిట్ సమర్పించిన డాక్యుమెంట్లు, పర్మిషన్స్ ను పరిశీలించిన తర్వాత పోలీసులు వాటిని తిరిగి అప్పగించారు. దీంతో మొదట కలకలం రేపిన ఈ ఘటన ఎలాంటి వివాదం లేకుండా ముగిసింది. అయినప్పటికీ, ఈ పరిణామం కొత్త చర్చలకు దారితీసింది. ముఖ్యంగా, లోకేష్ కనగరాజ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా షూటింగ్‌ను నిశ్శబ్దంగా ప్రారంభించారా అన్న అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ సంఘటన కారణంగా ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది.
ఇవి కూడా చదవండి








