మణిరత్నం నుంచి మేకింగ్ పాఠాలు!
సినీ నిర్మాణంలో బడ్జెట్ ఎంత ముఖ్యమో, ప్లానింగ్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో ఆలస్యం జరిగితే నిర్మాతలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్ మణిరత్నం(maniratnam) తన పని తీరుతో మరోసారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. విజయ్ సేతుపతి(vijay sethupathi), సాయి పల్లవి(Sai pallavi) జంటగా ఆయన రూపొందిస్తున్న ఇంజి వెల్లం(Inji vellam) షూటింగ్ అనుకున్న దానికంటే ఫాస్ట్ గా పూర్తైనట్టు తెలుస్తోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ జూలై 23న ప్రారంభమై, మూడు నెలలు కూడా గడవకముందే ముగియడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్లో పలువురు డైరెక్టర్లు డిసైడ్ చేసిన షెడ్యూల్స్కు అనుగుణంగా షూటింగ్ పూర్తి చేయలేకపోతున్నారు. దీనివల్ల బడ్జెట్ పెరగడంతో పాటు నిర్మాతలు ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ప్రెజర్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మణిరత్నం అనుసరించిన ప్లానింగ్, దాన్ని అమలు చేసిన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ఎక్స్‌పీరియెన్స్, క్లియర్ ప్లానింగ్, అందుబాటులో ఉన్న టైమ్ ను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా నిర్మాణాన్ని ఎంత క్రమబద్ధంగా ముందుకు తీసుకెళ్లవచ్చో ఆయన నిరూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇంజి వెల్లం సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. రిలీజ్ డేట్ పై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు తగినంత టైమ్ లభించనుంది. మరోవైపు, ఈ సినిమా రిలీజ్ కు ముందే విజయ్ సేతుపతి, సాయి పల్లవి నటించిన ఇతర సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. మరి మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ ప్రేమకథ సంక్రాంతి బరిలో ఎలాంటి ప్రత్యేకతను చాటుకుంటుందో చూడాలి.








