ఏపీకి జల భద్రత తెచ్చిన పట్టిసీమ లిఫ్ట్ : సీఎం చంద్రబాబు
కృష్ణా బేసిన్‌కు 500 టీఎంసీల గోదావరి జలాలు
శ్రీశైలం నుంచి రాయలసీమ దాహార్తి తీర్చిన కృష్ణమ్మ
ఏపీ వాటర్ మ్యాన్ అంటూ సీఎం చంద్రబాబుకు డెల్టా రైతుల ప్రశంసలు
అమరావతి, అక్టోబరు 10: పోలవరం ప్రాజెక్టు కంటే ముందే పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి సంపద సృష్టికి కారణమైన సీఎం చంద్రబాబును డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు సత్కరించారు. 11 ఏళ్లలో 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు జలభద్రత తెచ్చారని కొనియాడారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు సీఎంను సత్కరించి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి… ఇక్కడ పొదుపు చేసిన కృష్ణా జలాలను రాయలసీమకు అందించటం ద్వారా రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు కొత్తదారి చూపించారని రైతులు అన్నారు. రాష్ట్రానికి జల ప్రదాతగా నిలిచారని, ఏపీ వాటర్మ్యాన్గా మారారని రైతులు ముఖ్యమంత్రితో అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకూ 500 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి సద్వినియోగం చేశారని హర్షం వ్యక్తం చేశారు. పట్టి సీమ ప్రాజెక్టుతో తమకు కలిగిన ప్రయోజనాలను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు.
డెల్టా రైతుల కష్టాలు తీర్చిన ఆలోచన
పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు, శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టి సీమతో సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్ధిగా పంటలు పండించి రాష్ట్ర సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. పట్టిసీమ ద్వారా సాధించిన జల విజయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు రైతులు కూడా సహకరించారని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్లో గోదావరి జలాలను వినియోగించడం వల్ల పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమలో సాగు, తాగు నీటి అవసరాలకు మళ్లించగలిగామని ముఖ్యమంత్రి తెలిపారు. నీటి లభ్యతతో రాయలసీమలో కియా వంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు కూడా నీరు అందించగలిగామని పేర్కొన్నారు. సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన నీటి భద్రత కల్పించడంలోనూ సమగ్ర జల నిర్వహణ కీలక పాత్ర పోషించిందని సీఎం అన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి నిర్మల రామానాయుడు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ఉన్నారు.








